విజయవాడ
12-07-2025
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు శనివారం నాడు 1వ క్లస్టర్ అధ్యక్షులు బోండా నిరీష్ ఆధ్వర్యంలో చంద్రబాబు ష్యురీటి మోసం గ్యారంటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ 1వ క్లస్టర్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేసానికి మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మండేపూడి ఛటర్జీ, 1వ క్లస్టర్ వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పులా మాల వేసి ఘన నివాళులర్పించారు. బాబు మోసాలను, ప్రజలకు ఇచ్చిన బాండ్లు, వైయస్ జగన్ గారి ప్రెస్ మీట్ ని టివిలో చూపించారు. ఇంటింటికి స్కానర్ తో వెళ్లి ప్రజలతో ఆ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్ ని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ చంద్రబాబు గతంలో తప్పుడు హామీలు, తప్పుడు పత్రాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కు వెళ్లి అమలు చేసిన సంక్షేమ పధకాలు గురించి చెపితే కూటమి నేతలు మాత్రం ఇంటింటికి తిరిగి మోసపూరిత హామీలు అమలు చేస్తామని చెప్పి సంతకాలు చేసి బండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్రజల గడప వద్దకు వెళ్లి చంద్రబాబు మేనిఫెస్టో ను గుర్తుకు తెస్తూ ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేపించి చంద్రబాబు ఇచ్చిన హామీలను, బండ్లు గురించి, జగనన్న సంక్షేమ పధకాలు ఎలా ఎగొడుతున్నారో ప్రజలను వివరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాలలో పదవులు పొందిన వారు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు