స్టార్ హీరోలకు గిఫ్ట్ కోట్ల రూపాయల వాచీలు ఇచ్చిన అంబానీ
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తన పెళ్లికి హాజరైన స్టార్ హీరోలకు ‘అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్’ వాచీలను అనంత్ అంబానీ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటేనని తెలుస్తోంది.