సైబర్ నేరాలు అరిక్టడంతో ఏపీటీఎస్ నూతన సాంకేతికతను అందిస్తుంది

4
0

విజయవాడ, తేదీ: 24.07.2025

• సైబర్ నేరాలు అరిక్టడంతో ఏపీటీఎస్ నూతన సాంకేతికతను అందిస్తుంది
• సైబర్ మోసాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు
• సైబర్ సెక్యూరిటీ లో శిక్షణ పూర్తి చేస్తే ఐటీ రంగంలో అనేక అవకాశాలు
• రాష్ట్రంలో టెక్నాలజీ సర్వీసులను ప్రజలకు మరింత చేరువ చేస్తాం

– మన్నవ మోహన కృష్ణ, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్

        సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించేందుకు ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. గురువారం విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ లోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటలూ ఐటీ ఇన్ ఫ్రాస్టక్చర్ ను పర్యవేక్షిస్తూ ముందస్తు హెచ్చరికలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కీలక భూమి పోషిస్తుందన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సైబర్ నేరాలకు నేరగాళ్లు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు అనే విషయాలతోపాటు మోసపోయిన అనంతరం ఎలా ఫిర్యాదు చేయాలి అనే విషయాలపై అవగాహన సదస్సుల్లో తెలియజేస్తామన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని సాంకేతికత ద్వారా వీటిని అరికట్ట వలసిన అవసరం ఉందన్నారు. 

    సైబర్ సెక్యూరిటీ రంగంపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన విద్యార్ధులు మరియు ఐటీ నిపుణులకు శిక్షణ కోసం రాష్ట్రస్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ (HACKATHON 2025) ను నిర్వహించడం జరిగిందని, అందులో ఎంపికైన వారికి ఆరు నెలలపాటు సైబర్ సెక్యూరిటీ లో శిక్షణ ఇచ్చామని, శిక్షణా కాలంలో నెలకు రూ. 10 వేల స్టయ్ ఫండ్ అందించామన్నారు. అనంతరం ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన 30 మందికి సర్టిఫికెట్స్ ను అందించామన్నారు. సైబర్ సెక్యూరిటీ లో నిపుణులుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి దేశ, విదేశాల్లో అనేక ఐటీ కంపెనీల్లో అవకాశాలున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు డేటాను దొంగిలించటం, బెట్టింగ్ యాప్ ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి దోచుకుంటున్నారని అంతేకాకుండా వ్యాపార సంస్థల వ్యాపారాలపై దాడులు చేసి వారిన ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారన్నారు. 

  సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులతో పలు మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు సైబర్ మోసాలపై చర్యలకు ఆదేశించారన్నారు. 2013 లో సైబర్ సెక్యూరిటీపై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2017 లో సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చిందని దానికి ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 లో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ (APCSOC)  ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సంస్థ ప్రభుత్వ విభాగాలకు సైబర్ సెక్యూరిటీ ముప్పు రాకుండా నిరంతరం పర్యవేక్షించే ప్రత్యేక కేంద్రమన్నారు.

  ఏపీటీఎస్ తన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సేవలను ప్రభుత్వ సెక్టార్ లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లోకి కూడా విస్తరించాలని అంతేకాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా ఏపీకి సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ ను సెక్యూర్డ్ డిజిటల్ ప్యూచర్ గా నిర్మించడానికి యువతను నడిపించే లక్ష్యంగా ఏపీటీఎస్ పనిచేస్తుందని చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here