
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ సిటీ *తేదీ: 11-11-2025
సైబర్ క్రైమ్స్, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన చేదించడానికి సిబ్బందికి శిక్షణా తరగతులు
నగర పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో నగరంలోని 90 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి సైబర్ చట్టాలపై శిక్షణా తరగతులు
ఈ రోజు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో కమీషనరేట్ పరిదిలొని పోలీస్ ఉన్నత్తాధికారులతో, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బంది మొత్తం 90మందితో ఈ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలి అనే విషయాలపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ , డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఎ విధంగా చేదించాలి, సైబర్ నేరాలు జరుగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మరియు సైబర్ చట్టాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,….. టెక్నాలజీని పోలీసుల పనిలో సమర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని’’ తెలిపారు. అదే విధంగా పోలీసులకు పనిభారం తగ్గుతుందని తెలిపారు. ఈ వర్క్ షాప్ శిక్షణ పొందిన అధికారులు మరియు సిబ్బంది అందరూ వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో అయా కేసులను త్వరితగతిన చేదించేవిధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
సైబర్ నేరాల నివారణ చిట్కాలు:
- సైబర్ సిటిజన్ యాప్: ఈ యాప్ ద్వారా సుమారు 03 లక్షల మంది ప్రజలను నేరాలపై నిఘాలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
- 1930 కాల్ సెంటర్: సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ఉపయోగపడే కాల్ సెంటర్.
- NCRP పోర్టల్ & I4C: జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మరియు కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారమ్‌లు.
- సోషల్ మీడియాలో జాగ్రత్తలు: సోషల్ మీడియాలో ఏమి షేర్ చేయాలన్న దానిపై ఒక నిమిషం ఆలోచించాలి.
అదేవిధంగా ప్రజలు కూడా పైన తెలిపిన చిట్కాలను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డిజిటల్ అరెస్ట్ లలో కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరూ కూడా వాట్స్ యాప్ ద్వారా గాని వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ అరెస్ట్ లు చేయరని అటువంటి వాటిని నమ్మవద్దు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్, డి.సి.పి.లు కే.జి.వి.సరిత ఐ.పి.ఎస్. కే.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్. కృష్ణ కాంత్ పాటిల్ ఐ.పి.ఎస్. బి లక్ష్మీనారాయణ ఐ.పి.ఎస్ ఏ.డి.సి.పి.లు., ఏ.సి.పి.లు, సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]()
