ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 11, 2024
సేవ్ గర్ల్ ఛైల్డ్ విజేతలకు బహుమతుల ప్రదానం
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని (అక్టోబర్ 11) పురస్కరించుకొని జిల్లా వైద్యఆరోగ్య, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం, పీసీపీఎన్‌డీటీ చట్టం అమల్లో భాగంగా సేవ్ గర్ల్ ఛైల్డ్‌పై వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా వాటిలో విజేతలకు సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో నిధి మీనా అధికారులతో కలిసి ప్రశంసాపత్రాలు, మెడల్స్, బహుమతులు అందజేసి అభినందించారు. అదే విధంగా కార్యక్రమం అనంతరం సీడీ – ఎన్సీడీ, కేన్సర్ స్క్రీనింగ్ సర్వే 3.0లో భాగంగా గోడపత్రికను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎల్‌టీవో డా. ఉషారాణి, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, ఎన్‌సీడీ-సీడీ పీవో డా. మాధవి నాయుడు, ఎన్‌హెచ్ఎం డీపీఎంవో డా. నవీన్‌తో పాటు వైద్యఆరోగ్యం, విద్య, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.