ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.04-08-2025
సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృంధాలు.
నగరంలో విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృందాలు
మహిళలకు “శక్తి” యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు…
మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు, విధ్యార్ధినీ విధ్యార్ధులకు శక్తి యాప్, అత్యవసర సేవలైన కీలకమైన టోల్-ఫ్రీ నెంబర్ లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా మరియు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా, సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. పోలీసు కమిషనరేట్ పరిదిలోని శక్తి టీం బృంధాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే విధంగా అనుమానిత ప్రదేశములపై నిఘా పటిష్టం చేయడంతోపాటు విరివిగా ఆయా ప్రదేశాలను తనిఖీ చేయడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని అదుపులోకి తీసుకోవడంతో వారికి మత్తు పధార్ధాలను సేవించడం వలన కలిగే అనార్ధాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో ది.03.08.2025 తేదీన నగరంలోని వివిద పాఠశాలల నందు విద్యార్థినీ విద్యార్థులకు ఆపద సమయాలలో ఏ విధంగా తమని తాము రక్షించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ( సెల్ఫ్ డిఫెన్స్) గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి, ఈవ్ టీజింగ్ చేయడం వలన కలిగే నష్టాల గురించి, ఎల్.హెచ్.ఎం.ఎస్., సి.సి.కెమెరాల వలన ఉపయోగాలు, సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి మరియు నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు POCSO యాక్ట్ గురించి, డైయల్ 112 , మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
అదే విధంగా ది.03.08.2025 తేదీన ఇంటర్ సెప్టర్ మరియు యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృంధాల వారు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలను నిర్వహించి 117 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం మరియు వారిలో 49 మంది అనుమానిత వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేయడం జరిగింది. ఓపెన్ ప్రదేశాలలో మధ్యం సేవించిన 20 మందిని అదుపులోనికి తీసుకుని తగు చర్య నిమిత్తం వారిని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది. ఈ క్రమంలో వివిద ప్రదేశాలలోని 05 పాన్ షాప్ /బడ్డీ కోట్లను తనిఖీ చేయాయడం జరిగింది. లేడీస్ హాస్టల్స్ సమీపంలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.