Home Political news సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: మల్లాది విష్ణు

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: మల్లాది విష్ణు

3
0

 *11.10.2024*

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: మల్లాది విష్ణు

మహాశక్తి ప్రతిరూపమైన దుర్గాదేవిని పూజించి ఆరాధించే విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఓ ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ఆ ఆదిపరాశక్తి మనకు సదా స్ఫూర్తినిస్తుందన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు చేసిన పూజలు లోక కళ్యాణానికి, సుఖ శాంతులకు ఆలవాలం అవుతాయని పేర్కొన్నారు. ఆ జగన్మాత చల్లని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులు, సిరి సంపదలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here