
11-11-2025
సెంట్రల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం..
రూ. 13.78 కోట్లతో ఏర్పాటుకానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు విర్చువల్ గా ప్రారంభోత్సవం చేసారు
ధి:-11-11-2025 మంగళవారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద 13.78 కోట్లతో ఏర్పాటుకానున్న ఫ్లోటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు , జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఆధ్వర్యంలో శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం MSME పారిశ్రామిక పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదగా వర్చువల్ పద్ధతిలో ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేసారు…
ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు విర్చువల్ గా మాట్లాడుతూ :-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషిచేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి గా తమ ఆకాంక్ష అని తెలియజేసారు…
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ:- ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సు (ఎఫ్ఎఫ్ఎస్)లను అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వాంబే కాలనీ ప్రాంతంలో రూ. 13.78 కోట్లతో ఏర్పాటుకానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు అని, జిల్లాలో దాదాపు రూ. 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారరు అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు, తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు, యువత ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు…
పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, ఎంఎస్ఎంఈ పార్కులు వేదికలుగా నిలుస్తాయన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు…
ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:- స్వయం సహాయక సంఘాల మహిళలు రడీమేడ్ గార్మెంట్స్ తయారీవంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్సులో ఏర్పాటు చేసుకోవచ్చని, ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లతో పాటు అంతర్గత సీసీ రహదారులు, పటిష్ట డ్రెయినేజీ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కింగ్ ప్రాంతం ఇలా వివిధ వసతులు కూడా అందుబాటులో ఉంటాయని…
విజయవాడ అర్బన్ క్లస్టర్‌లో కీలక ప్రాంతంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా NDA ప్రభుత్వం ద్వారా లభిస్తుందన్నారు, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఎరుబోతు రమణారావు, కార్పొరేటర్ కంచిదుర్గ, జిల్లా పరిశ్రమల అధికారి పి.మధు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జి.జ్యోతి, స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
