విజయవాడ నగరపాలక సంస్థ
12-07-2025
సూపర్ స్వచ్ఛత లీగ్ లో విజయవాడ
ఇది కేవలం ప్రజలు పారిశుధ్యకామిక్ కార్మికులు సిబ్బంది వల్లే సాధ్యమైంది- మేయర్, రాయన భాగ్యలక్ష్మి
ఈ పురస్కారం కేవలం విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందుతుంది- కమిషనర్, ధ్యానచంద్ర హెచ్ యం
స్వచ్ఛ సర్వేక్షన్ 2024 లో సూపర్ స్వచ్ఛత లీగ్ లో విజయవాడ నగర పాలక సంస్థ ఎంపికైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి , కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ జూలై 17, 2025న భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగబోవు స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం 2024లో ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము చేతుల్లో మీదుగా అవార్డును అందుకోబోతున్నట్లు తెలిపారు. అందుకు ముఖ్య కారకులైన, ప్రజలు పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నగర కమీషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ
స్వచ్ఛ సర్వేక్షన్ 2024 లో భాగంగా మొట్టమొదటిసారిగా సూపర్ స్వచ్చతా లీగ్ ప్రవేశపెట్టిన సంవత్సరంలోనే లీగ్ లో విజయవాడ నగరం ఎంపికవటం గర్వకారణం అని, ఇండోర్, నవి ముంబై, సూరత్ నగరాల జాబితాలో విజయవాడ నగరం కూడా చేరినందుకు తమకెంతో గర్వంగా ఉందని. ఈ అవార్డు నగర ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సర్వేక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిదని తెలిపారు.
2024 విజయవాడ లో తీవ్రమైన విపత్తు బుడమేరు వరదలు సంభవించినప్పటికీ గత సంవత్సరాలు కంటే ఎక్కువగా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న నగరాలతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయవాడ స్థానం దక్కించుకోవడం గొప్ప విషయమని అన్నారు. విపత్తు సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్, డిఎంఏ పి. సంపత్ కుమార్, ఎండి స్వచ్ఛ ఆంధ్ర వి.అనిల్ కుమార్ రెడ్డి, సహకారంతో విజయవాడ నగరం పదివేల పారిశుద్ధ్య కార్మికులతో, 200 మందికి పైగా అధికారులతో, 32 కు పైగా ఐఏఎస్ లతో వరదల వల్ల వచ్చిన వ్యర్ధాలకు, వ్యర్థ నిర్వహణ చేయటం వల్ల విజయవాడ త్వరితగతిన కోలుకోవడమే కాకుండా జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని అందుకోబోతుందని తెలిపారు. ఈ పురస్కారం కేవలం విజయవాడ నగరానిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటిది అని అన్నారు.