కర్నూలు జిల్లా
సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపెనా ?
ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా ?
ఏడాది కాలం పాటు ప్రజలను చంద్రబాబు చేసింది మోసమే
సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారు చంద్రబాబు సమాధానం చెప్పాలి
బాబు ఏడాది పాలన అంతా మళ్ళీ 3D గ్రాఫిక్స్
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- చంద్రబాబు సీఎం గా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది
- ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు
- సూపర్ సిక్స్ అంటూ ఊదర గొట్టారు
- అధికారం ఇస్తే అమలు చేస్తా అని నమ్మించారు
- చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం
- సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపెనా ?
- చంద్రబాబు సమాధానం చెప్పాలి
- ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి
- 3 వేల నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు
- 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు
- ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? ఎంతమందికి భృతి ఇచ్చారు ?
- రైతులకు ఏడాదికి 20 వేలు ఇస్తా అన్నారు
- రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వం అని చెప్పారు
- ఏడాదిలో అన్నదాత సుఖీభవ ఒక్క రైతుకైనా ఇచ్చారా ?
- రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారు
- స్కూల్ పిల్లలకు ఏడాదికి 15 వేలు ఇస్తా అన్నారు
- ఒక ఏడాది 15 వేలు ఎగ్గొట్టారు
- ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం అయినా ఇంకా ఇవ్వలేదు
- ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని 15 వేలు ఇచ్చే హామీ ఏమయ్యింది ?
- ప్రతి మహిళలకు మహిళా శక్తి కింద నెలకు 15 వందలు..ఏడాదికి 18 వేలు ఇస్తా అన్నారు
- మహిళలను ఒక శక్తిగా చేస్తా అని చెప్పిన హామీ ఏమయ్యింది ?
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి మీకు మనసు ఎందుకు రాలేదు ?
- ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఒక పథకాన్ని అమలు చేసి చేయనట్లు చేశారు
- సూపర్ సిక్స్ కాకుండా మిగతా హామీలకు దిక్కులేదు
- కరెంట్ ఛార్జీలు రెండు సార్లు పెంచి 17 వేల కోట్ల భారం వేశారు
- చంద్రబాబు ఏడాది పాలన మొత్తం 3D గ్రాఫిక్స్
- మీకు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా ?
- రేపు ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి