సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులందరికీ పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం అర్హులందరికీ పెన్షన్ 

పశ్చిమ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య అయినా సమన్వయంతో పరిష్కరిస్తాం 

ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ 

నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. 

విజయవాడ పశ్చిమ జులై 1

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ లో అర్హత గల అందరికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

పశ్చిమ నియోజకర్గంలో అర్హులైన పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలోనీ 22 డివిజన్లలో పలు ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేయడం జరిగింది.

 పంజా సెంటర్ వద్దకి రాగా టిడిపి రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్కే ఫతావుల్లా ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ని ఆహ్వానించారు.                         

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ                           

పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి జనసేన మద్దతో ఇక్కడ విజయం సాధించడం జరిగిందన్నారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల ప్రకారం సోమవారం ఉదయం నుంచి పెన్షన్ అర్హులందరికీ ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని తెలిపారు. 

నియోజక వర్గంలో ఏ చిన్ని సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే దిశగా సమన్వయంతో పనిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో 

జోనల్ కమిషనర్ కీర్తన, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, భాజపా నాయకులు పోతిన బేసు,

శ్రీధర్ మాజీ కార్పొరేటర్ రామయ్య

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ కే నాగుల్ మీరా, పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ పొట్టి శ్రీహరి, 

49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ , రెడ్డిపల్లి గంగాధర్ డివిజన్ జనసేన నాయకులు మున్సిపల్ రెవెన్యూ అధికారులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *