సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా
కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది – వైఎస్ షర్మిలా రెడ్డి
గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే…ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారు
కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది
సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? శ్వేత పత్రం విడుదల చేయండి – వైఎస్ షర్మిలా రెడ్డి
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
– ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం
– పల్లెం,గంటే తో నిరసన చేపట్టాం
– ఇది చంద్రబాబు కి వినపడాలని మా ఉద్దేశ్యం
– ఇది మంచి ప్రభుత్వమట
– ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు
– ఇది ఎట్లా మంచి ప్రభుత్వం అవుతుందో బాబు సమాధానం చెప్పాలి
– సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నారు
– ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు అన్నమాట
– ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఇవి లేవు
– ప్రభుత్వ పరంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
– వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవు
– అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
– 20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కినట్లె ఉంది
– ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పడిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం
– కానీ చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం అంటున్నారు
– పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనారా ?
– రాష్ట్రంలో రైతుల కష్టాలు కనిపించడం లేదా ?
– వరదలో సర్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికి పరిహారం ఇస్తారా ?
– ఇదే ముంచే ప్రభుత్వం కాకపోతే మరేంటి ?
– మోడీకి రాష్ట్రం పై చిన్నచూపు
– ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోతే రైల్ నీర్ కూడా ఇవ్వలేదు
– ఏడాదికి 6 వేల కోట్ల ఆదాయం రైల్వే శాఖ తీసుకుంటుంది
– ఇదేనా మోడీకి రాష్ట్రం మీద ప్రేమ ?
– రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ తో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలి
– తల్లికి వందనం పథకం అమలు లేదు
– ఎంతమంది బిడ్డలు అంటే అందరికీ 15 వేలు ఇస్తాం అన్నారు
– గత ప్రభుత్వం ఒక బిడ్డకు ఇచ్చారు
– ఈ ప్రభుత్వం కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు
– గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే…ఈ ప్రభుత్వాన్ని గద్దేనెక్కించారు
– ఈ ప్రభుత్వం కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు
– మహాశక్తి పథకం కింద ఇచ్చే 15 వందలు ఎక్కడ ?
– కోటి మంది మహిళలకు ఎప్పుడు పథకం వర్తింప జేస్తారు
– మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు…బడ్జెట్ లేని రాష్ట్రం కూడా.
– 100 రోజుల్లో బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు
– ఏ పథకానికి ఎంత బడ్జెట్ చెప్పే ధైర్యం లేదు
– కనీసం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ధైర్యం కూడా చేయడం లేదు
– బాబు సర్కార్ మీద కూడా జనాలు విశ్వసనీయత కోల్పోతున్నారు
– గతంలో జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయింది
– చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం
– మీది మంచి ప్రభుత్వం అయితే…. సూపర్ సిక్స్ అమలు చేయండి
– భాద్యతలను విజయలుగా చెప్పుకోవడం మానండి
– ప్రభుత్వానికి నిధులు కొరత అని చెప్పడం మానండి
– ఎన్నికలకు ముందే రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పులు అని మీకు తెలుసు
– మీరు మంచి చేస్తారు అని ప్రజలు మీకు ఓటేశారు
– ఇది మంచి ప్రభుత్వం కాదు…ముంచే ప్రభుత్వం
– సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు…ఒక శ్వేత పత్రం విడుదల చేయండి