సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్

Spread the love

ఎన్టీఆర్ జిల్లా/నున్న, అక్టోబర్ 01, 2025

సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్

  1. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ సూపర్ జీఎస్టీతో రైతులకు, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చాలా లాభం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. బుధవారం విజయవాడ గ్రామీణం నున్నలో సూపర్ జీఎస్టీపై జరిగిన అవగాహన కార్యక్రమం, ర్యాలీలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతులకు, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కొత్త జీఎస్టీతో రైతులకు చేయూత లభిస్తుందని తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై ఐదు శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుందన్నారు. కొత్త జీఎస్టీలో బిందు సేద్యంపై రైతులకు వివిధ పంటల్లో ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈ సంస్కరణ వల్ల రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *