సురక్షా కార్యక్రమం లో బాగంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్ కి 05 లక్షల రూపాయల నగదును చెక్ రూపంలో అందించిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు.

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ. తేదీ.10-11-2025.

సురక్షా కార్యక్రమం లో బాగంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్ కి 05 లక్షల రూపాయల నగదును చెక్ రూపంలో అందించిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు.

 ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత అంటే కేవలం భరోసా కాదు నిరంతర పర్యవేక్షణ కూడా అంటూ కమిషనరేట్ పరిధిలోని 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ, 64 వార్డులు మొత్తం 1211 చ.కిలోమీటర్లు అంతా నిరంతర సి.సి.కెమెరాల పర్యవేక్షణలో ప్రతి గ్రామం ప్రతి వీధి సి.సి.కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనేది లక్ష్యంగా సురక్షా 360 కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసి నగరంలో సి.సి.కెమెరాల ద్వారా నేరాలను అదుపులోనికి తీసుకు వచ్చారని, అదే విధంగా ఆదునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకుని తక్కువ సమయంలో నేరస్తులను గుర్తించి వారిని అరెస్టు చేయడంతోపాటు బాధితులకు స్వాంతన చేకూరేలాగా చర్యలు తీసుకొంటున్నారు.

అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా సమాజ అభివృద్ధి, భద్రత మరియు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం కింద శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారు నగరంలో నేరాలను జరుగకుండా నిరోందించి నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో  తమ వంతు సహాయంగా నగరంలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయు నిమిత్తం 05 లక్షల రూపాయల నగదును చెక్ రూపంలో ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.కి అంధించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డి.సి.పి.  షిరీన్ బేగం ఐ.పి.ఎస్, ట్రాఫిక్ ఏ.సి.పి.లు  వంశీధర్ గౌడ్  రామచంద్ర రావు  శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రతినిధులు  ఎం. వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్,  బి. గోపాలరావు, జనరల్ మేనేజర్,  సయ్యద్ ఉస్మాన్, అసిస్టెంట్  జనరల్ మేనేజర్  మరియు  జే. రత్నకుమార్, ఏరియా మేనేజర్ పాల్గొన్నారు

Loading