సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో పాల్గొని ఇంటింటి గృహ సందర్శన చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చిన మంత్రి కొలుసు పార్థసారధి
నూజివీడు,జులై 02: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో పాల్గొని ఇంటింటినీ సందర్శించి వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు వివరించి వారికి ప్రభుత్వం నుండి అందుతున్న లబ్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలువురు ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇది బాధ్యత కలిగిన మంచి ప్రభుత్వం అని మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రతి పల్లెలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి పల్లెల్లో తిరుగుతుంటే అద్భుతమైన స్పందన ప్రజల నుండి వస్తోందని ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు ఇది మా ప్రభుత్వం సుపరిపాలన అందించే మంచి ప్రభుత్వము వారి ఆశలు, ఆకాంక్షలు తీర్చే ప్రభుత్వమని ప్రజలు సంతోషంగా చెప్పుతున్నారని తెలిపారు. గతంలో అరాచక పాలన ప్రభుత్వం ఉన్నదని, ప్రజలను అనేక విధాలుగా భయభ్రాంతులను గురి చేశారని తెలిపారు. సంక్షేమం అంటే అన్ని పథకాలు ఆపేసి నాలుగు పథకాలు అమలు చేయడం కాదు, సంక్షేమం ఇస్తూ అన్ని పథకాలు అమలు చేయడం నాయకుని లక్ష్యమని,రూ .3 వేలు ఇస్తున్న పెన్షన్ పెద్ద ఎత్తున రూ.4 వేలకు పెంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 45 లక్షల మందికి అమ్మఒడి వేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో 67 లక్షల మంది పిల్లలకు రూ.10 వేల కోట్లు ఇవ్వడం జరిగింది. దీపం పథకం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. తాము బాధ్యతతో ప్రజల కోసం పని చేస్తున్నామనీ, ఇంకా చేయలసింది ఎంతో ఉందన్నారు.
సీతారామపురం గ్రామానికి సుపారిపాలతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనటానికి చేరుకున్న మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఇంటికి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వము అందజేసే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకొని, వారు చెప్పే సమస్యలు వింటూ వారు అందజేసిన సమస్యల అర్జీలను తీసుకోవడం జరిగింది.