సుజనా ను గెలిపిస్తాo రెల్లి సంఘం నేత ప్రసాద్
పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రెల్లి హక్కుల సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎర్రంశెట్టి ప్రసాద్ అన్నారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని అధికారం లోకి వచ్చిన జగన్ అవే వర్గాలకు చెందిన 27పథకాలను రద్దు చేసారని అన్నారు. ఆ వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసారని ఆరోపించారు. జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని ఏపిలో కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు. పశ్చిమంలో సుజనా చౌదరిని మెజార్టీ తో గెలిపించాలని రె ల్లి సామాజిక వర్గానికి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.