సుజనా చౌదరి ఔదార్యం కార్యకర్తకు ఆర్థిక సాయం

Spread the love

సుజనా చౌదరి ఔదార్యం

కార్యకర్తకు ఆర్థిక సాయం

అనారోగ్యంతో  మరణించిన బిజెపి కార్యకర్త పిళ్లా దుర్గారావు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో శనివారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 48 వ డివిజన్ బిజెపి అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ తో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి పిళ్ళ దుర్గారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని హరి ప్రసాద్  ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *