
సీ ఎం ఆర్ ఎఫ్ తో పేదలకు భద్రత
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనాచౌదరి
పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా లబ్ధిదారులకు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం అందజేశారు.
పశ్చిమ లోని 36 మంది లబ్ధిదారులకు రూ 26 లక్షల 86 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.. ప్రభుత్వ సహకారంతోపాటు సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమ లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధా
విద్య ద్వారానే ఉపాధి ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చని 60 నెలల తన పాలనలో చేయగలిగినంత అభివృద్ధిని చేసి చూస్తామన్నారు
మేధా దానం, ధన దానం , శ్రమదానం చేసే వారిని ప్రోత్సహిస్తామని అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు
రాజకీయాలకతీతంగా సీ ఏం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమ ప్రజలకు ఏ అవసరమొచ్చిన ఎన్డీఏ కార్యాలయం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కోగంటి రామారావు, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు ( చంటి) మైలవరపు మాధురి లావణ్య,ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య , పత్తి నాగేశ్వరరావు, పగడాల కృష్ణ, తిరుపతి అనూష, తిరుపతి సురేష్, మైలవరపు కృష్ణ, నున్న కృష్ణ, పోతిన భేసు కంటేశ్వరుడు, ఆకారపు విజయ కుమారి,బెవర శ్రీనివాస్, పీవీ చిన సుబ్బయ్య, పైలా సురేష్,
రెడ్డి పల్లి రాజు,పోతినీడి లోకేష్, మంగళపురి మహేష్ , దేవిన హరిప్రసాద్ , పల్లంటి ఆది, రేగళ్ల లక్ష్మణ్, జ్ఞాన బాలన్, ఏలూరి సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు..
![]()
