సీవోఇఎ-ఏపి నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌*విజ‌య‌వాడ‌ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ జేఏసీ అమరావతి

9
0

సీవోఇఎ-ఏపి నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌*విజ‌య‌వాడ‌ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ జేఏసీ అమరావతి అనుబంధం) ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 15 మందితో కూడిన రాష్ట్ర నూతన కమిటీ ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కె.సుమన్, ప్రధాన కార్యధర్శిగా ఇ.మధుబాబు, సహా అధ్యక్షులుగా పి.శివ సైదారావు, కోశాధికారిగా సిహెచ్ ర‌మణమూర్తిల‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి అమ‌రావ‌తి జేఏసీ రాష్ట్ర అధ్య‌క్షుడు బొప్పరాజు వెంక‌టేశ్వ‌ర్లు, ఇతర నాయకులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాల‌న్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సర్వీస్ రూల్స్‌తో పాటు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు అమలు పరిచిన హెచ్ఆర్ పాలసీని అందరికీ అమలు చేయాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నికకు ఎలక్షన్ అబ్జర్వర్స్‌గా ఏపీ జెఎసి అమరావతి ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కిషోర్ కుమార్, గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్య‌క్షుడు వేల్పుల అర్లయ్య, ఏపి జేఏసి అమరావతి క్యాపిట‌ల్ సిటి కమిటీ చైర్మన్ పి.రవి ప్రసాద్‌ సమక్షంలో ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో పబ్లిసిటీ సెక్రటరీ తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం చైర్‌పర్సన్ పారే లక్ష్మీ, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, క్యాపిటల్ యూనిట్ చైర్మన్ పెద్దాడ రవిప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ర్యాలీ సాయి కృష్ణతేజ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్.నారాయణరావు , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here