సీఎం జగన్ ను మర్యాదపూర్వక కలిసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

Spread the love

ది.01.06.2024

సీఎం జగన్ ను మర్యాదపూర్వక కలిసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఆప్యాయంగా పలకరించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితులపై ఆరా తీశారు. సెంట్రల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని వెల్లంపల్లి చెప్పగా, సీఎం జగన్ అభినందించారు. రాష్ట్రంలోని పేదలంతా వైసిపి పార్టీకి అండగా నిలబడ్డారని, సంక్షేమ పథకాలు కొనసాగాలని ఆశిస్తూ రాష్ట్ర ప్రజలంతా వైసీపీకే ఓటు వేశారన్నారు. రాష్ట్రంలో మరోసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *