సీఎం చంద్రబాబుకు బుద్ధప్రసాద్ ఆహ్వానం
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం కలిశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం ఛాంబరులో చంద్రబాబును కలిసి తన తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఆగస్ట్ 4నుంచి ఏడాది పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగే శత జయంతి సభకు హాజరవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు బుద్ధప్రసాదుకు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆర్.అండ్.బీ రహదారుల పరిస్థితిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సీఎం చంద్రబాబుకు వివరించి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.