విజయవాడ నగరపాలక సంస్థ
15-03-2025
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవల ప్రజల సహకారంతోనే సాధ్యం – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో జరగాలి- ధ్యానచంద్ర, నగర కమిషనర్
సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవల ప్రజల సహకారంతోనే సాధ్యం అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ మేయర్, రాయన భాగ్యలక్ష్మి. శనివారం ఉదయం వన్ టౌన్, పంజా సెంటర్ నందు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర తో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కేవలం ప్రజల సహకారంతోనే జరుగుతుందని, ఇప్పటి వరకే ప్రజల సహకారంతో భారతదేశంలోనే ఉత్తమ స్థానాలను స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయవాడ నగరపాలక సంస్థ పొందిందని, ప్రత్యేకంగా కొండ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వాహన చేయటం ఎంతో కఠినమైన పరిస్థితిని, విజయవాడలో అటువంటి కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు నిత్యం అహర్నిశలు శ్రమిస్తూ విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి శ్రమ అభినందనీయమని అన్నారు. ప్రజలందరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, వస్తువులు కొనటానికి బయటకు వెళ్ళినప్పుడు వారి ప్రయాణంలో పర్యావరణహితమైన సంచులను భాగం చేసుకోవాలని తద్వారా మనం కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రయాణిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించారని, ప్రజలందరూ దీనికి సహకరిస్తూ కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలని, 120 మైక్రోన్లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని, అవి పర్యావరణాన్ని హాని కలిగిస్తాయని, భూమిలో కలవటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, దాని నివారించేందుకు పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం కొనటం అమ్మకం నిషేధం పూర్తి స్థాయిలో జరగాలని అన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను డ్రైన్లో పడేస్తున్నారని, అవి మురుగు పారుదలకు ఆటంకం కలిగిస్తున్నాయని, వర్షాకాలంలో నీరు రోడ్డుపైకి చేరి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయని, ప్రజలందరూ దీన్ని గ్రహించి, డ్రైన్ ల లో ప్లాస్టిక్ వ్యర్ధాలను వెయ్యకుండా, సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నిషేధించడమే కాకుండా పర్యావరణహితమైన వస్తువులను వాడుతూ తమ వంతు సహాయాన్ని చేయాలని కోరారు.
తదుపరి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటికి ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయి, ప్రజలు మలేరియా బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఏంటి, వంటి విషయాలపై అవగాహన కల్పించిన స్టాల్ ను విచ్చేయటమే కాకుండా ప్రజలకు మొబైల్ వ్యాన్ ద్వారా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వాన్ వద్ద అక్కడ పాల్గొన్న ప్రజలకు అవగాహన కల్పించారు. తదుపరి రాలి ద్వారా పంజా సెంటర్ లో ఉన్న వ్యాపారస్తులకు ప్రజలకు సింగిల్ న్యూస్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కల్పించారు.
అందులో భాగంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , పూల వ్యాపారి వద్ద కెళ్లి, పూలుకొని పర్యావరణహితమైన సంచులు వేసుకొని ప్రజలు కూడా ఇలాగే పర్యావరణహితమైన వస్తువులను వాడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చిన వన్ ఎర్త్ వన్ లైఫ్ వారు పెట్టిన ప్రత్యేక స్టాల్ ను వీక్షించారు, ప్రజలు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసే విధానంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అబ్దుల్ అకిబ్ అర్షద్, ఉమ్మిడి వెంకటేశ్వరరావు, బోయి సత్యబాబు, మరుపిళ్ళ రాజేష్, మహదేవ్ అప్పాజీరావు, అధికారులు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, అసిస్టెంట్ ఎగ్జామినేటర్ ఆఫ్ అకౌంట్స్ సుబ్బారెడ్డి, వన్ ఎర్త్ వన్ లైఫ్ అడ్మిన్ లీలాకుమారి వారి బృందం, తదితర్లు పాల్గొన్నారు.