సాయి నాథుని కృప తో రాష్టం సర్వతోభివృద్ధి చెందాలి మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు

Spread the love

 సాయి నాథుని కృప తో రాష్టం సర్వతోభివృద్ధి చెందాలి

మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు 

బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ 

నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ శాంతి, సౌభాగ్యం, అష్టైశ్వర్యాలతో జీవించి రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా షిరిడి సాయినాధుడు అనుగ్రహించాలని కోరుకున్నాననిమధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

     గురు పౌర్ణమి సందర్భంగా 

బీసెంట్ రోడ్ లోని విహెచ్ఆర్ కాంప్లెక్స్ గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపూడి వల్లభరావు నేతృత్వంలో ఆదివారం జరిగిన వేడుకల్లో బోండా ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వాణిజ్య వ్యాపార రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అప్పుడే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. చిరు వ్యాపారులు, బలహీన వర్గాలు, ముఠా కార్మికులు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలన్నారు. ఆర్థిక అష్టదిగ్బంధనం నుంచి రాష్ట్రం బయటపడేందుకు దైవానుగ్రహం కూడా తోడుండాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రజలు కూడా వారి వారి మతాచారం ప్రకారం భగవంతుడిని ప్రార్థించాలన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రతీ పనిలోనూ సాయి నాధుడు అండగా ఉంటాడని విశ్వసిస్తున్నానని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఆలయం వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపూడి వల్లభరావు, ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, కార్యదర్శి యాదా శ్రీనివాసరావు (రంగ), సంయుక్త కార్యదర్శులు చేవూరి శ్రీనివాసులు, గోసాల శశిధర్, కోశాధికారి చేవూరు శ్రీకృష్ణ బీసెంట్ బీసెంట్ రోడ్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాణిజ్య వర్గాలు, చిరు వ్యాపారులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భం గా మూడు వేల మంది భక్తులకు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ తో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేదారు చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *