సామాజిక ఆర్థిక అభివృద్ధిలో
కమ్యూనిటీ ఆర్గనైజర్ల పాత్ర కీలకం..
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారు..
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం, భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమలోని కమ్యూనిటీ ఆర్గనైజర్లతో, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎమ్ శ్రీకాంత్ తో సమీక్ష నిర్వహించారు..
వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
పశ్చిమ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డ్వాక్రా గ్రూపుల వివరాలను
అడిగి తెలుసుకున్నారు .
ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమాన్ని
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సామాన్య, మధ్యతరగతి
ప్రజలకు తెలియజేసే బాధ్యత కమ్యూనిటీ ఆర్గనైజర్లు,ఆర్పీలు , సి.ఎల్.ఆర్పిలు, తీసుకోవాలని సూచించారు.
బడుగు బలహీన వర్గాలు, చేతివృత్తుల వారు ఎక్కువగా ఉన్న పశ్చిమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు చేపట్టారని నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ 4 పథకంలో భాగంగా అట్టడుగున జీవిస్తున్న పేదలను గుర్తించి మార్గదర్శకులకు అప్పజెప్పి బంగారు కుటుంబానికి బాటలు వేసేలా కమ్యూనిటీ ఆర్గనైజర్లు , ఆర్పీలు, సి .ఎల్ ఆర్. పి లు చొరవ తీసుకోవాలన్నారు.
ప్రజలందరూ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కమ్యూనిటీ ఆర్గనైజర్ల పాత్ర కీలకమైనదని ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా, మోహన లక్ష్మీ పాల్గొన్నారు..