సమాజ ఉన్నతిలో విశ్రాంత సైనికులు భాగస్వామ్యులు కావాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

4
0

 సమాజ ఉన్నతిలో విశ్రాంత సైనికులు భాగస్వామ్యులు కావాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

విశ్రాంత ఆర్మీ సైనికులతో సమావేశమైన ఎమ్మెల్యే

ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నాకు వారి కష్టాలు తెలుసు

గుడివాడ18:దేశ సేవ చేసి రిటైరైన సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వామ్యం చేసేలే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో పలువురు విశ్రాంత సైనికులు ఎమ్మెల్యే రామును కలిశారు. ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. 

అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి వెంకటేశ్వరరావు ఆర్మీలో పని చేశారని,ఆర్మీ కుటుంబం నుండి వచ్చిన నాకు రిటైరైన తర్వాత వారి కష్టాలు తెలుసన్నారు.

దేశరక్షణలో విశేష సేవలు అందించి,ధైర్యానికి ప్రతి రూపాలైనా సైనికులను మనమందరం ప్రత్యేకంగా గౌరవించుకోవాలన్నారు. కఠిన శ్రమతో కూడిన శిక్షణ పొంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి, రిటైరైన సైనికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా, వారి సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. విశ్రాంత సైనికులు సమాజ ఉన్నతిలో భాగస్వామ్యులు అయ్యేలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాముతో జరిగిన సమావేశంలో పలువురు ఆర్మీ విశ్రాంత సైనికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here