సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం

2
0

సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించడం పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం

జిల్లాలో ఇంతవరకు 95 వేల బంగారు కుటుంబాలను గుర్తించాం.. 5181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారు

పీ4 కార్యక్రమంపై మార్గదర్సులు , అధికారులతో సమీక్షించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్

     ఏలూరు, జూలై , 16 :    సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించి పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.   స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం  జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమం ఉద్దేశ్యాలను తెలియజేసి, అధికారులతో మంత్రి  సమీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ  సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మంది నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూత నివ్వడమే పీ4 లక్ష్యమన్నారు.  పేదలకు సేవచేద్దామని, వారి  జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు సంకల్పించి సదుద్దేశ్యంతో ఉన్న ధనవంతులకు పీ4  కార్యక్రమం ఒక మంచి వేదికన్నారు.  జిల్లాలో ఇంతవరకు 95 వేల  మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, వారిలో ఇంతవరకు 5181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు. పీ4 కార్యక్రమంపై మార్గదర్శకులపై ఎటువంటి ఒత్తిడి లేదని, వారికి వారు స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.   మార్గదర్శకులు నిధులు ఇవ్వడమే కాక పీ4 స్ఫూర్తిని అర్ధం చేసుకుని బంగారుకుటుంబాలకు వారు అందించే సాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి ద్వారా ఆ కుటుంబాలు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి సాదిస్తున్నాయనే తెలుసుకునేందుకు సమయాన్ని కూడా వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు.   బంగారు కుటుంబాలలో సమస్యలు తెలుసుకుని, ఆయా కుటుంబాలలోని పిల్లలకు విద్య, వారి జీవనోపాధికి అవసరమైన  ,  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ కుటుంబం అభివృద్ధి వైపు అడుగులు వేసేలా మార్గదర్శి చేయూత అందిస్తారన్నారు.  రాష్ట్ర అభివృద్ధిపై మంచి విజన్ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో రూపొందించిన విజన్-2020 ఫలాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్@ 2047 సాధనకై విజన్ యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మొదటి స్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పీ4 కార్యక్రమంలో మార్గదర్సకులు అందించే నిధులు, వాటి వినియోగం, బంగారుకుటుంబాలు అభివృద్ధి, తదితర అంశాలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, వివరాలను పీ4 వెబ్సైటు లోపొందుపరచడం జరుగుతుందన్నారు.  జిల్లాలో మరింతమంది మార్గదర్శలను గుర్తించి పీ4 కార్యక్రమాన్ని  పటిష్టంగా అమలు చేసి జిల్లాలో పేదరికాన్ని రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.  
         జిల్లా కలెక్టర్  కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పీ4 కార్యక్రమంలో సర్వే నిర్వహించి 99 వేల 905  బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇంతవరకు 129 మార్గదర్శకులు గుర్తించి  5181 కుటుంబాలకు మార్గదర్శకులు అండగా నిలబడ్డారన్నారు.  పీ4 కార్యక్రమంలో మార్గదర్సకులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకులకు పీ4 కార్యక్రమం  స్ఫూర్తిని తెలియజెసి, వారు స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు. 
         జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు.  నిరుపేద కుటుంబాలలో ఆర్ధిక కారణాలతో పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, మార్గదర్శకులుగా వచ్చేందుకు ప్రవాసాంధ్రులు ఎందరో ఉన్నారని, వారికి పీ4 స్ఫూర్తిని అధికారులు తెలియజేసి, పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. 

          దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సేవా దృక్పధంతో ఉన్న ధనవంతులకు పేదల జీవితాలను మార్చి, బంగారుమయం చేయాలనే సేవా దృక్పధం కలిగిన ధనవంతులకు పీ4 కార్యక్రమం పెద్ద అవకాశమన్నారు. సమాజంలో ఆర్ధిక అంతరాలు తొలగించేందుకు పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు.  తానూ 10 లక్షల రూపాయల విలువ చేసే 100 గొర్రెలను పేద కుటుంబాలకు అందించి వాటి ద్వారా కొంతకాలంలో  మరిన్ని గొర్రెలు ఉత్పత్తి ఐన తరువాత తనకు తిరిగి ఇచ్చే పద్ధతిన అందించనున్నారు.  అదేవిధంగా తన నియోజకవర్గంలో పాముకాటు, ప్రమాదాల కారణంగా పాడి పశువులను కోల్పోయిన పాడిరైతులకు వారు కోలుకునే వరకు తన పాడి పశువులను అందిస్తున్నాన్నారు.   
          చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో పారిశ్రామికవేత్తలను మార్గదర్శకులుగా గుర్తించి వారి సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
         జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పీ4 కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుందన్నారు. 

       ఈ సందర్భంగా బుట్టాయిగూడెంలో వెదురు తో హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే గిరిజనులను అడవిలో వెదురు పోందిందేందుకు  ఆటంకాలు కలిగిస్తున్న అటవీ శాఖాధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల జీవనోపాధికి వెదురు హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారని, వారి ఉపాధి దెబ్బతినేవిధంగా వెదురు సేకరణపై ఆంక్షలు విధించవద్దని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 

         ఈ సందర్భంగా సభకు హాజరైన వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు తాము మార్గదర్శకులుగా చేపట్టిన సేవా పనులను తెలియజేసారు. 
       డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ రాజ్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్,  ఎం.వి. రమణ, ఆర్టీసీ   నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ యూనిట్ల కార్యాలయాల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here