
డిసెంబరు.5
సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన యీ సమావేశంలో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల వివరాలను ఛైర్మన్ వివరించారు. అకాడమీ నిర్వహణ పై పలు అంశాలపై చర్చించారు.
డైరక్టర్ విశ్వనాథన్ కు సి.ఆర్.మీడియా కార్యాలయం వద్ద సెక్రటరీ వి. మణిరాం, మేనేజర్ ఎం. భాస్కర నారాయణ స్వాగతం పలికారు. సమావేశం అనంతరం కార్యాలయ సిబ్బంది ని డైరక్టర్ కు సెక్రటరీ మణిరాం పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి ఎస్. శ్రీనివాస జీవన్, అకాడమీ అకౌంట్స్ అధికారి జి. శాంతారాం, లైబ్రేరియన్ వి.శేఖర్, ఇతర సిబ్బంది జాలి రెడ్డి, ఆదిత్య లు పాల్గొన్నారు
![]()
