సమస్యలు పరిష్కారమే ధ్యేయం.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

3
0

 భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

సమస్యలు పరిష్కారమే ధ్యేయం.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ 

విజయవాడ… బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ ఫిర్యాదు స్వీకరించారు.

వచ్చి న ఫిర్యాదు లను సంబంధించిన శాఖల పోస్ట్ చేయించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సమస్యలు వెను వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో షుగర్ పేషంట్స్ అధికసంఖ్యలో ఉన్నారని ఆ గ్రామస్తుడు కుర్రే లక్ష్మారెడ్డి మంత్రి కి వివరించగా రక్త పరీక్షలు చేయడానికి వారానికి ఒకసారి ఉదయం ఆరు గంటల కు వైద్య సిబ్బంది ని అందు బాటులో ఉండేందుకు సానుకూలంగా మంత్రి స్పందించారు.

*నేషనల్ హెల్త్ మిషన్ పధకం లో నియమితులైన యోగా,నేచురోపతీ మెడికల్ ఆఫీసర్ లను రెగ్యులర్ చేయాలని డాక్టర్ ఎస్ సుజన నేతృత్వంలో వైద్యులు మంత్రి దృష్టికి రాతపూర్వకంగా అందించారు

ప్రకాశం జిల్లా కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని వేములపాడు గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి చెందిన వ్యవసాయ భూమి ని వేరేవారు కబ్జా చేసారు కావున మంత్రి వర్యులు జోక్యం చేసుకుని భూమిని ఇప్పించాలని ఆమె ఫిర్యాదు లో పేర్కొంది 

రాయచోటి కి చెందిన పి శ్రీ నివాస్ కుమార్ రాజు తమ గ్రామంలో ఉన్న కమ్యునిటీ హెల్త్ సెంటర్ పరిధిలో కిడ్నీ సమస్యలు తో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉండడం వల్ల డయాల్ సిస్ 20బెడ్స్ అందుబాటులోకి తీసుకుని రావాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు 

ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here