సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష- వైఎస్ఆర్సిపి సెంట్రల్
నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీమణి వెల్లంపల్లి శ్రీవాణి
సీఎం జగన్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీమణి వెల్లంపల్లి శ్రీవాణి అన్నారు. సెంట్రల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావును గెలిపించాలని కోరుతూ విజయవాడ రామకృష్ణాపురం 31వ. డివిజన్ పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రభుత్వములో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించమని, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సీఎం జగన్ ను మరల ముఖ్యమంత్రి చేస్తామని స్థానిక ప్రజల చెప్తున్నారని ఆమె అన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కి దక్కిందని పేర్కొన్నారు. మన నియోజకవర్గ మరింత అభివృద్ధి సాధించాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మహిళ నాయకులు లక్కం రాజు సునీత వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.