సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనే సీఎం కావాలి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

Spread the love

 సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనే సీఎం కావాలి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని 58 డివిజన్లో ఉన్న బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఆదివారం నాడు ఓట్లను అభ్యర్థిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి సీఎం  జగన్ ప్రభుత్వమే రావాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ హాయంలో హామీలను ఇచ్చి అమలు చేయకుండా చివరకు మేనిఫెస్టో అని సైతం తమ వెబ్సైట్లోంచి మాయం చేశారని.. ఇప్పుడు మళ్లీ సూపర్ సిక్స్ పేరుతో తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని, ప్రజలు మోసపోవద్దని ఆయన ఓటర్లకు  విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే మరొకసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉంటుందని కనుక ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాస రెడ్డి, బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *