24-06-2025
సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎంపీ గా ఏడాది పూర్తి చేసుకున్న ఎంపీ కేశినేని చిన్ని
ఎన్టీఆర్ భవన్ లో ఏడాది పాలనపై ఎంపీ మీడియా సమావేశం
ఏడాది అభివృద్దిపై సుపరిపాలనలో తొలిఅడుగు పుస్తకావిష్కరణ
20 కేజీల కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ
ఎంపీ కేశినేని శివనాథ్ ను సన్మానించిన టిడిపి నాయకులు, కార్యకర్తలు
విజయవాడ : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కానీ రైల్వే పనులు పరిష్కరించటంతో పాటు ఎంపీగా ఏడాది పాలనలో ఎనిమిది ఆర్.వో.బిలు పట్టాలు ఎక్కించటం జరిగింది. రెండు మూడు నెలల్లో ఆర్.వో.బిలకు శంకుస్థాపన జరుగుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమృత భారత స్టేషన్ పథకం కింద పదిహేను రోజుల్లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులకి సంబందించి 850 కోట్ల రూపాయాలతో టెండర్లు పిలవనుండటం తను సాధించిన అద్బుత విజయంగా భావిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు.
విజయవాడ పార్లమెంట్ ఎంపీ గా కేశినేని శివనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్బంగా మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ గా తను ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని టిడిపి నాయకులతో కలిసి విడుదల చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా ఏడాది పూర్తి చేసుకోవటం చాలా ఆనందంగా వుందన్నారు. ఎంపీ సీటు ఇచ్చి పార్లమెంట్ కి పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్డీయే కూటమి నేతలు డిప్యూటీ సీఎం , బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి కి దన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఏడాది ప్రయాణంలో తనకి తోడుగా నిలిచిన పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, సేవా కార్యక్రమాల సమయం నుంచి అండగా నిలిచిన ప్రాతికేయు మిత్రులకు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీగా తొలిసారి కావటంతో అవగాహన పెంచుకోవటానికి, పరిస్థితులను అర్ధం చేసుకోవటానికి నెలన్నర సమయం పట్టిందన్నారు. అధికారులు, నాయకులతో కో ఆర్డినేట్ చేసుకుంటా అందరితో కలిసి ప్రయాణించటం ఆనందంగా వుందన్నారు.. ఈ సంవత్సరం కాలంలో విజయవాడ నగరాభివృద్ది పై దృష్టిపెట్టినట్లు తెలిపారు.
ఏడాదిలో ఎనిమిది ఆర్.వో.బిలకు డిపిఆర్
అమృత భారత్ స్టేషన్ పథకం కింద శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ది చేసిన గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్లను త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయన్నారు. ముందుగా రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభమవుతుందన్నారు.
రైల్వే శాఖ అధికారులతో గత ఆరునెలలుగా పోరాటం చేయటంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫెండింగ్ లో వున్న రైల్వే పనులన్నీ పట్టాలు ఎక్కాయన్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో రెండు సార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి అమరావతి లో భాగమైన విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది ఎంత ముఖ్యమో వివరించటం జరిగిందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాని గుణదల రెండు ఆర్.వో.బిలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్.వోబి. ఓల్డ్ రాజేశ్వరరావు పేట దగ్గర ఒక ఆర్.వోబి. వెస్ట్ – సెంట్రల్ నియోజకవర్గాలు కలిపే ఎర్రకట్ట వంతెను నాలుగు లైన్ల వంతెన గా నిర్మించేందుకు డిపిఆర్ తయారు చేయించటం జరిగిందన్నారు.అలాగే రాయనపాడు, కొండపల్లి మూడు ఆర్.వో.బిలకు కూడా డిపిఆర్ తయారు చేయించినట్లు తెలిపారు. అదే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ పామ్స్ అభివృద్ది చేయటం జరిగిందన్నారు. ఈ రైల్వే లైన్ల అభివృద్ది విషయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సహాయంతో ఈ రైల్వే పనులను నిర్వర్తించటం జరగిందన్నారు.
జాతీయ రహదారుల అభివృద్ధి
తొలి పార్లమెంట్ సమావేశాల్లోనే సీఎం చంద్రబాబు తో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి మహానాడు రోడ్డు నుంచి నిడమానురు వరకు 6.3 కిలో మీటర్ల మేరకు ఫ్లై ఓవర్ శాంక్షన్ చేయించుకు రావటం జరిగిందన్నారు. మెట్రో ప్రాజెక్ట్ రావటం వల్ల ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం కావటంలో ఆలస్యం జరిగిందన్నారు.
నేషనల్ హైవే అధికారులు విజయవాడ హైదరాబాద్ మధ్య సిక్స్ లైన్ రహదారిని అవుట్ రింగ్ రోడ్ వరకు నిర్మిస్తామంటే … ..వారితో పోరాడి గొల్లపూడి వరకు ఆరు లైన్లు రహదారి కొనసాగించే విధంగా నేషనల్ హైవే అధికారులను ఒప్పించటం జరిగిందన్నారు. ఈ మేరకు డిపిఆర్ సంస్థ కూడా ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు. నేషనల్ హైవే, రైల్వేస్ కారణంగా విజయవాడ నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకుండా వుండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆటోనగర్ కి వంద కోట్ల రూపాయిలు
ఫ్లై ఓవర్ , మెట్రో పనులు కారణంగా ఆటోనగర్ లోకి లారీ రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసిన ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్దికి సీఆర్డీయే వంద కోట్ల రూపాయలు సూత్రప్రాయంగా ఆమోదించటం జరిగిందన్నారు. ఆటోనగర్ నుంచి నిడమానురు , పోరంకి నుంచి ఆటోనగర్ , శక్తి కళ్యణ మండపం నుంచి ఆటోనగర్ రహదారులతో పాటు మహానాడు రోడ్డు చివర వరకు , బల్లెం వారి వీధి రోడ్లు విస్తరణ పనులు కోసం ఈనిధులు వినియోగిస్తారని తెలిపారు. లక్షల మందికి పైగా కార్మికులు జీవనోపాధి పొందుతున్న ఆటోనగర్ లోకి ఇరవైనాలుగు గంటలు లారీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృషి చేయటం జరుగుతుందన్నారు.
విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేసేందుకు . కాలువ శుభ్రం చేయటంతోపాటు, ..పారిశుద్ధ్యం మెరుపర్చటం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు . ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వంతెన విస్తరణ తో పాటు,,కొత్త వంతెనలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. విజయవాడ లో డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ సమస్య తోపాటు మంచినీటి సమస్యలు లేకుండా డిపిఆర్ సిద్దం చేయించినట్లు తెలిపారు. రాబోయే రెండు మూడుఏళ్లలో కొండ ప్రాంతానికి మంచినీళ్లు, స్ట్రామ్ వాటర్ సమస్య పరిష్కరిస్తామన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న వారు ఇబ్బందులు పడకుండా మంచి నీరు పైకి పంపేలా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఎన్.ఎ.సి బ్రాంచ్ కోసం కృషి
భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ వుండే ఈ ప్రాంతంలో కార్మికులు నైపుణ్యం పెంపొందించే విధంగా ఎన్.ఎ.సి బ్రాంచ్ అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి కే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తో చర్చించామని, ఐదారు నెలల్లో ఒక తుది రూపు తీసుకువస్తామన్నారు. ..
కనకదుర్గమ్మ అభివృద్దికి మాస్టర్ ప్లాన్
ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి కనకదుర్గ గుడి…ఆలయం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరిగే సమావేశంలో మాస్టర్ ప్లాన్ పై ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు.
భక్తులు కూర్చొనేందుకు వీలుగా వెయింటింగ్ హాల్స్, కారు పార్కింగ్ , టూ వీలర్ పార్కింగ్ కి పదకొండు అంతస్తుల భవనం, పాత ప్రదేశంలోనే కేశఖండశాలను పునరుద్దరించే విధంగా మాస్టర్ ప్లాన్ వుండనున్నట్లు తెలిపారు రెండేళ్లల్లో వచ్చే కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రోడ్లు, ఘాట్ ల అభివృద్ధి పై దృష్టి సారించినట్లు తెలిపారు. నగరవాసుల వినోదం కోసం ప్రతి ఏడాది ఒక ఫెస్ట్ నిర్వహించే అంశం కలెక్టర్ లక్ష్మీశా చర్చించినట్లు తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ది
ఎపీ ఏరోస్పేస్, రక్షణ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి తో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఐదారుసార్లు
ఇండస్ట్రీ మీట్ పెట్టడం జరిగిందన్నారు.. డిఫెన్స్ కమిటీలో తాను ఉండటం వల్ల రాష్ట్రానికి ఢిపెన్స్ బ్రహ్మోస్, బిడిఎల్ వంటి సంస్థలు రాయలసీమ, కోస్తా ప్రాంతంలోరావాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.దాదాపు 17 ఢిపెన్స్ పి.ఎస్.యుల్లో 12 ఢిపెన్స్ పి.ఎస్.యులతో మాట్లాడాను.. దాదాపు మచిలీపట్నంలో కూడా గోవా షిప్ యార్డ్ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు జగ్గయ్యపేట , నందిగామ లో రెండు వేల ఎకరాల్లో ఢిపెన్స్ క్లస్టర్ ను సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
విమానాశ్రయ అభివృద్ది
గత ఐదేళ్లలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి అభిశృద్ది జరగలేదన్నారు.. ప్రతి నెల సమీక్షా సమావేశాలు నిర్వహించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి అరవై నుంచి డెబ్బై శాతం పనులు పూర్తి అయ్యే విధంగా కృషి చేశామన్నారు.. మూడు నెలల్లో వారణాసి…అహ్మాదాబాద్ కొచ్చిన్, గోవా, పుణే లకు విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయని తెలియజేసేందుకు గర్వంగా వుందన్నారు.
క్రీడాభివృద్ది
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మైదానాలను తన సొంత నిధులతో ఆధునీకరించి…లాంగ్ జంప్ ఫిట్స్ తయారు చేయటంతో పాటు,,,ఎనిమిది రకాల క్రీడా వస్తువులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. రాబోయే కాలంలో ప్రతి గ్రామం…ప్రతి వార్డ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించి..తన సొంత నిధులతో బహుమతులుగా 700 క్రికెట్ కిట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియం కు రూ. 28 కోట్లు ఖేలో ఇండియా పథకం కింద నిధులు తీసుకురావటం జరిగిందన్నారు. అలాగే డిసెంబర్ లో నేషనల్ బ్యాడ్మింటన్ షిప్ విజయవాడ లో జరగనుందన్నారు.
తనని నమ్మి గెలిపించిన ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని, ప్రజా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆనందంగా తీసుకుంటానన్నారు. విజయవాడ పార్లమెంటు అభివృద్ధి లో విలువైన సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరించటంతోపాటు అమలు చేస్తానన్నారు.,రాబోయే నాలుగేళ్ల ల్లో అభివృద్ధి ద్వారా తన పని తీరుతో ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తానన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు పుస్తకావిష్కరణలో ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ, టిడిపి సీనియర్ నాయకులు నరసింహాచౌదరి, హూడా మాజీ చైర్మన్ టి.ప్రేమనాథ్, టిడిపి నాయకులు మాదిగాని గురునాథం, పీతా బుజ్జి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.