శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన పరిసర ప్రాంతాలను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖరా బాబు

0
0

[7/1, 8:02 PM] manepallimalli903: ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

            తేదీ. 01-07-2025

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన పరిసర ప్రాంతాలను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖరా బాబు ఐ.పి.ఎస్

ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థాన ఈ.ఓ. శీనా నాయక్ తో కలిసి దేవస్థానం మహా మండపం నుండి కనక దుర్గానగర్, ఇటీవల ఆక్రమణలు తొలగించిన ప్రదేశాలను, కుమ్మరి పాలెం సెంటర్ లోని టి టి డి స్థలం, పున్నమి, భవాని ఘాట్స్ పరిశీలించారు.

జాతీయ రహదారి నుండి మహా మండపంవైపు రావడానికి రిటైనింగ్ వాల్ వద్ద చెక్ పాయింట్, రధం సెంటర్ వైపు నుండి వ్యతిరేక దిశలో దేవస్థానం వైపు వాహనాలు రాకుండా బారికేడ్స్ ఏర్పాటు విషయాల గురించి, భక్తుల సౌకర్యార్ధం కనకదుర్గ నగర్ నుండి మహా మండపం వరకు బ్యాటరీ వాహనాల ఏర్పాటు, రధం సెంటర్ లో సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు.

మున్సిపల్ ఆఫీస్ వద్ద గల హోల్డింగ్ ఏరియా అభివృద్ధి, అక్కడ నుండి భక్తులను దేవస్థానం నకు చేర్చే ఏర్పాట్ల గురించి ఏ.ఈ. కోటేశ్వరరావు, పశ్చిమ ఏ.సి.పి దుర్గారావు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు,దేవస్థాన ఈ.ఓ.శ్రీ శీనా నాయక్ ఆడిషనల్ డి.సి.పి. జి.రామకృష్ణ పశ్చిమ ఏ.సి.పి దుర్గా రావు ఏ.ఈ. కోటేశ్వరరావు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
[7/1, 8:05 PM] manepallimalli903: మచిలీపట్నం, జులై 1:

జిల్లాలో రాబోయే సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ గూడూరు, పెడన, మచిలీపట్నం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు.

తొలుత గూడూరు మండలం లేళ్ల గరువు, కప్పలదొడ్డి గ్రామాలను, పెడన మండలంలో నందమూరు గ్రామం, మచిలీపట్నం మండలంలో గోకవరం గ్రామం సందర్శించారు.

ఆయా గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలు అవుతుంది, రీ సర్వే కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది అనే అంశాల పైన జిల్లా కలెక్టర్ పరిశీలన జరిపారు.

మధ్యాహ్నం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికలతో మధ్యాహ్నం భోజన పథకం గురించి విచారించి వారితో కలసి నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. రోజు భోజనం ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా చిక్కి రాగి జావా ఇస్తున్నారా లేదా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇదే గ్రామమా లేదా ఎక్కడినుండి వస్తారని కలెక్టర్ వారిని అడగగా వారు పక్కనున్న గ్రామాల నుండి సైకిల్ పై వస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏమవుతారని అడగగా డాక్టర్ అవుతామని కొందరు బాలికలు చెప్పారు.

బాగా ఇష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ వారికి ఉద్బోధించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, ఈ సంవత్సరం పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎంత సాధించారు, అత్యున్నత మార్కులు ఎన్ని వచ్చాయని, వచ్చే సంవత్సరానికి మరింత మెరుగ్గా ఫలితాలు సాధించేందుకు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని ప్రధానోపాధ్యాయురాలను సుధారాణిని అడిగారు.

అందుకు ఆమె సమాధానం చెబుతూ పాఠశాలలో 270 మంది విద్యార్థులు ఉన్నారని, ఈ సంవత్సరం 90 శాతం ఫలితాలు సాధించారని, పదిమంది విద్యార్థులు సప్లిమెంట్ పరీక్షలు రాయగా నలుగురు ఉత్తీర్ణులు అయ్యారన్నారు. పాఠశాలలో 584 మార్కులు అత్యధికంగా వచ్చాయని, మరో పదమూడు మంది విద్యార్థులకు 500 మార్కులకు మించి వచ్చాయన్నారు.
ఈసారి 595 మార్కులు వచ్చే విధంగా కృషి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సబ్జెక్టుల వారీగా పరీక్షలు పెడుతూ విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్కు వివరించారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ బాగా చదువుతున్న వారిని ఒక కేటగిరీగా వేరుచేసి వారిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు.

తదనంతరం జిల్లా కలెక్టర్ పెడన మండలం నందమూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ లో భాగంగా అంగన్వాడి కేంద్రాలు, ప్రార్థన మందిరాలు ఎలా ఉన్నాయి? వాటి వద్ద మరుగుదొడ్లు గాని ఇంకుడు గుంతలు గాని కాంపోస్టు గుంతలు గాని ఉన్నాయా లేదా, చెత్తాచెదారాలు వేయుటకు తడి చెత్త పొడి చెత్త బుట్టలు గాని అందుబాటులో ఉంచారా లేదా అనే వివరాలను పంచాయతీ కార్యదర్శి జానకి లక్ష్మినీ అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో చెక్లిస్ట్ ప్రకారం అన్ని వసతులు ఉన్నాయా లేదా గమనించుకొని, లేని వాటిని వెంటనే సమకూర్చాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

తదుపరి కలెక్టర్ మచిలీపట్నం మండలం గోకవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ జరిగిన రి సర్వే వివరాలను మండల సర్వేయర్ రాజబాబును, గ్రామ సర్వేయర్ విజయ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సర్వే పూర్తయిందని, వీఎస్ లాగిన్ లో వివరాలు ఉన్నాయని వారు కలెక్టర్కు వివరించారు.
దీంతో జిల్లా కలెక్టర్ 5 శాతం మించి ఎక్కడైనా తేడా వచ్చిందా అంటూ ఆ ప్రాంత తులనాత్మక పట్టిక (కంపారిజన్ స్టేట్మెంట్ )వివరాలు అడగగా అవి వారు చూపకపోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పట్టికను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, డి ఎల్ డి ఓ పద్మావతి, డి ఎల్ పి ఓ రజావుల్లా, గూడూరు తహసిల్దారు రాజ్యలక్ష్మి ,ఎంపీడీవో కేవీ రామకృష్ణ, మచిలీపట్నం తహసిల్దార్ నాగభూషణం, గూడూరు కప్పలదొడ్డి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు బట్ట తోట శివకృష్ణ, లేళ్ళ గరువు సర్పంచ్ మానస, నందమూరు సర్పంచు పరస నరసింహ రావు పలువురు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here