Home Political news ‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ హుండీ ఆదాయం వివరాలు

‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ హుండీ ఆదాయం వివరాలు

2
0

 *19 మార్చి 2025

 

  ‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల  దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ

హుండీ ఆదాయం వివరాలు

తేది. 19.03.2025 న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, మల్లేశ్వర మహా మండపం 6 వ అంతస్తులో  నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్బంగా 15రోజులకు గానూ రూ.02,65,88,961/-(అక్షరాలా రెండు కోట్ల, అరవై ఐదు లక్షల, ఎనబై ఎనిమిది వేల, తొమ్మిది వందల అరవై ఒక రూపాయలు )నగదు రూపంలో, 500గ్రాముల బంగారం, 4 కేజిల 358గ్రాముల వెండి రూపంలో లభించాయి.

ఆలయ కార్యనిర్వహణాధికారి  కె. రామచంద్ర మోహన్, ఉప కార్యనిర్వహణాధికారి  ఎం. రత్నరాజు హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు.దేవదాయ శాఖసిబ్బంది,వన్ టౌన్ పోలీసులు, ఎస్.పి.ఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమం లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here