శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

Spread the love

 శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 5 : స్థానిక చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు (పి.సి ), బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా సందర్భంగా ప్రతి నిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు వివరించారు. దేవస్థానంలో దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆయా కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ (రాజా), శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు మజ్జి ఈశ్వరరావు, తత్తడి భరత్ కుమార్ , పోతిన సాంబశివరావు, భోగవల్లి శ్రీధర్ , ముదిలి గణేష్, బంక హనుమంతరావు, ఈది ఎల్లా రాజారావు, పిళ్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *