శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి.. పరమ శివుడికి రుద్రాభిషేకం

Spread the love

శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి.. పరమ శివుడికి రుద్రాభిషేకం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరికి ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అర్చకస్వాములు స్వామి అమ్మవార్ల విభూతి తిలకం భువనేశ్వరికి అందించగా, నుదిటిన తిలకధారణ చేసుకున్న భువనేశ్వరి రాజగోపురం ముందు బాగంలోని ద్వజ స్దంభానికి నమస్కరించారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంభాదేవి అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈవో హరిదాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు. అర్చకులు వేదపండితులు వేదాశీర్వచనలు చేసి తీర్ధప్రసాదాలనిచ్చి దీవించారు. నారా భువనేశ్వరితోపాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సతీమణి కూడా ఉన్నారు.

మరోవైపు తన కోసం భక్తులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని నారా భువనేశ్వరి శ్రీశైలం పర్యటనకు ముందు అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. తాను ఆలయానికి వస్తున్నట్లు ఎక్కువగా హడావిడి, హంగామా చేయవద్దంటూ భువనేశ్వరి శ్రీశైలం ఆలయ అధికారులకు తెలిపారు. అనంతరం దర్శనానికి వచ్చిన భువనేశ్వరి త్వరగా దర్శనం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కూడా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *