శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం – విషయం తేల్చేసిన పోలీసులు

2
0

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం – విషయం తేల్చేసిన పోలీసులు

శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన 9 పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజు బుల్లెట్స్ లభ్యమయ్యాయి. రోడ్డు డివైడర్ మధ్యలో బుల్లెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసే వారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్, బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, SLRకు చెందిన ఐదు బుల్లెట్లు, SLRకు చెందిన నాలుగు ఖాళీ బుల్లెట్లు, 9MMకు చెందిన 4 బుల్లెట్లు గుర్తించారు. అయితే ఈ బుల్లెట్స్‌ శ్రీశైలం ఏఆర్‌ కానిస్టేబుల్స్‌కి సంబంధించినవి ఆత్మకూరు DSP రామాంజినాయక్‌ తెలిపారు. వాసవీ సత్రం దగ్గర భోజనానికి వెళ్లి బుల్లెట్లను మరచిపోయాడని తెలిపారు

సదరు కానిస్టేబుల్ మరో వారం రోజుల్లో రిటైర్ అవ్వాల్సి ఉందని… ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు DSP. ఆయన భక్తి మార్గాన్ని అనుసరిస్తారని.. అందుకే ఎర్ర గుడ్డ క్యారీ చేస్తారని వివరించారు. అయితే అదే సంచిలో కొన్ని వంకాయ బాంబ్స్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు ఆ కానిస్టేబుల్ వద్ద ఉన్నాయి అనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here