తిరుమల…
శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రం విరాళం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం, చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది