శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం..

Spread the love

శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం..

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌:- ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా 5వ రోజైన శుక్ర‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ చ‌వితి) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తుంది. “యాదేవీ స‌ర్వభూతేషు ల‌క్ష్మీరూపేణ సంస్థితా” అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి.. అని చండీ స‌ప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నైవేద్యంగా పంచభోగాలైన పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డు, పులిహోర‌, ద‌ద్యోజ‌నాల‌ను నివేదిస్తారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *