Home Andhra Pradesh శ్రావణ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

శ్రావణ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

2
0

“`శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్ర కీలాద్రి, విజయవాడ.

“09 ఆగస్టు 2025”

శ్రావణ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ – తేది. 09.08.2025 శనివారం ఘనంగా జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం,
ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రిగిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.

ఈరోజు ఉదయం పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవముగా ప్రారంభం అయింది.

ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు.

తప్పెట్లు, కోలాట నృత్యప్రదర్శనలు, భజన సంకీర్తనా
గానం కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవం గా సాగినది.

ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది.

వేలాది మంది భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు.“`

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here