Home Political news శిరస్త్రాణం భారం కాదు… బాధ్యత… శిరస్త్రాణం ప్రాణం కాపాడే అస్త్రం...

శిరస్త్రాణం భారం కాదు… బాధ్యత… శిరస్త్రాణం ప్రాణం కాపాడే అస్త్రం ..

3
0

 శిరస్త్రాణం భారం కాదు… బాధ్యత…

   శిరస్త్రాణం ప్రాణం కాపాడే అస్త్రం ..

     “హెల్మెట్ పెట్టు  చాక్లెట్ పట్టు “

 వినూత్న శైలిలో శిరస్త్రాణ అవగాహన  

విజయవాడ, ఫిబ్రవరి 14:

శిరస్త్రాణం ధరించటం భారం కాదని, అది బాధ్యతని, ప్రాణాలు కాపాడడంలో హెల్మెట్ అస్త్రం వంటిదని ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. 

స్థానిక బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరలో వాహనదారుల భద్రత కోసం రవాణాశాఖ అధికారులు శిరస్రాణం ధారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. విభిన్న శైలిలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన ప్రతి ఒక్కరికి అధికారులు చాక్లెట్లను పంపిణీ చేశారు. “హెల్మెట్ పెట్టుకో చాక్లెట్ పట్టుకో అని నినాదంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ హారయ్యారు. ఈ సందర్భంగా ఎ. మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, తద్వారా ప్రమాదాల కొని తెచ్చుకుని వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఇబ్బందులు పడటం చేయొద్దన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వాహనదారులతోపాటు కుటుంబ సభ్యుల జీవితాలను సైతం అస్తవ్యస్తంగా మారుస్తుందన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో సంవత్సరానికి వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలకు ఒక రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ప్రమాద సమయంలో మన ప్రాణాలకు అస్త్రంలా ఉపయోగపడుతుందన్నారు. చాలామంది వాహన చోదకులు తమకు ఎటువంటి ప్రమాదం జరగదని భావిస్తుంటారని కానీ మీరు సక్రమమైన విధానంలో వాహనం నడుపుతున్నప్పటికీ ఎవరైనా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలలో సైతం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. సమాజంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయినప్పుడు తమ సంతానం విద్యకు దూరమై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ప్రతి ఒక్కరం వింటున్నామన్నారు. అటువంటి విపత్కర పరిస్థితులు వాహన చోదకుల కుటుంబాలకు ఏర్పడకూడదంటే ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమైనా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు తనను నమ్ముకున్న వారికి జీవితాంతం తోడుగా ఉండి వారి భవిష్యత్తు జీవితం ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటే హెల్మెట్ ధారణ తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు చిట్లిపోతుంది వంటి అసంబద్ధ వాదనలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం తెలుసుకోవాలన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మీ తలను రక్షించుకోవడం హెల్మెట్ యొక్క ప్రాథమిక విధి అన్నారు. ప్రమాదంలో వాహనదారుడు రోడ్డుపై పడిపోవడం లేదా ఢీకొన్నప్పుడు కలిగే ప్రభావాన్ని తట్టుకునేలా హెల్మెట్ ఉపయోగపడుతుందన్నారు. తల పుర్రె పగుళ్లు లేదా మెదడు దెబ్బతినడం వంటి తీవ్రమైన తల గాయాల కాకుండా కాపాడుతాయన్నారు. మీరు ధరించే హెల్మెట్ వలన మీ కుటుంబ సభ్యులను కూడా రక్షిస్తుందనే నిజాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు రోడ్ల పైకి ప్రవేశం లేదని చెప్పారు. హెల్మెట్ ధరించని వాహన చోదకులపై కేసులు నమోదు చెయ్యడం లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.

 ఆర్టీవోలు ఆర్ ప్రవీణ్, కే వెంకటేశ్వరరావు, వాహన తనిఖీ అధికారులు వి. పద్మాకర్, ఎ. ఉదయ శివప్రసాద్, డీవి రమణ, బి. శ్రావణి, గీతాంజలి, ప్రియదర్శిని, కెవి రవిగోపాల్, బి ఉమ మహేశ్వరరావు, లాజర్ బాబు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు, కార్యాలయ పరిపాలన అధికారులు సత్యనారాయణ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ శ్రీదేవి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here