శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు బాధ్యత తీసుకుంటా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు బాధ్యత తీసుకుంటా

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ, జులై 15.

కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్లు అందించి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటానని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నియోజకవర్గంలోని భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కుట్టు మిషన్ లో శిక్షణ తీసుకున్న మహిళలకు అధునాతన హై లాక్ కుట్టుమిషన్లు ఎమ్మెల్యే అందించడం జరిగింది.

సుజనా చౌదరి ఆధ్వర్యంలో కోల్ ఇండియా సి ఎస్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా రోటరీ జిల్లా 

( 3020) వారు ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. తమకు కుట్టుమిషన్లు అందించిన ఎమ్మెల్యే కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.

కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో

ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు 

అడ్డూరి శ్రీరామ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కే నాగులమీరా, టిడిపి నేత బొమ్మసాని సుబ్బారావు, కార్పొరేటర్ బుల్లా విజయకుమార్, మాజీ కార్పొరేటర్  

యేదు పాటి రామయ్య,39 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *