ఘనంగా యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలు
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి తనయుడు యలమంచిలి కార్తీక్ జన్మదిన వేడుకలను కూటమి నేతలు
భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కూటమి నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కార్తీక్ బాబుదని అన్నారు . ప్రజాసేవలో ఎల్లప్పుడు ముందుండే కార్తీక్ మరెన్నో పుట్టినరోజులను జరుపుకొని ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు. . బిజెపి యువ నాయకులు పైలా సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కరకట్ట వద్ద గల చిగురు నవజీవన్ బాల భవన్ లోని బాలలకు అల్పాహారం, బ్రెడ్, పండ్లు , పాలు పంపిణీ చేశారు. బాలల సమక్షంలో కేక్ కట్ చేశారు, భవానిపురం వెంకట వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చీరలు, దుస్తులు,పండ్లు అందజేశారు. పైలా సురేష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకునే యువ నాయకుడు కార్తీక్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కూటమి నేతలు బోగవల్లి శ్రీధర్, బి ఎస్ కె పట్నాయక్, గుర్రంకొండ, గుడివాడ నరేంద్ర రాఘవ, ఉమ్మడి వెంకటేశ్వరరావు, పత్తి నాగేశ్వరరావు, అర్షద్, పి వి చిన్న సుబ్బయ్య, వేరుకొండ ఉమాకాంత్, తాజుద్దీన్, రేఖపల్లి శ్రీను, బొమ్ము గోవిందు, ఏలూరి శరత్, ప్రదీప్ రాజ్, దొడ్ల రాజా, పగడాల కృష్ణ, వేంపల్లి గౌరీ శంకర్, నాగోతి రామారావు, బుల్లబ్బాయి, తిరుపతి సురేష్, తిరుపతి అనూష, ముదిగొండ శివ, భాను, ముదిరాజ్ శివాజీ, మల్లీ , అఖిల్, పచ్చిపులుసు ప్రసాద్, దేవిన హరిప్రసాద్, బెవరశ్రీను,మల్లెపు విజయలక్ష్మి, రౌతు రమ్య, చింతా బాబి, మంతెన తరుణ్ కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .