Home Political news శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వర జన్మదిన శుభా వేడుకలు ఘనంగా

శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వర జన్మదిన శుభా వేడుకలు ఘనంగా

2
0

 :30-1-2025

ధి:30-1-2025 గురువారం ఉదయం  టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వర జన్మదిన శుభా వేడుకలు ఘనంగా

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని 21డివిజన్ లలో ఆయా డివిజన్ కమిటీ ల ఆధ్వర్యంలో మరియు పశ్చిమ నియోజకవర్గం లోని బొండా రవి యువసేన వారు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగినది

 ముందుగా మొగల్రాజపురం లోని MLA బొండా ఉమామహేశ్వరావు ఇంటి వద్ద గాజుల బ్రదర్స్ ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేసి బొండా ఉమా జన్మదినోత్సవ వేడుకల ప్రధాన కేకును కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న బొండా ఉమా తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ , బొండా రవితేజ చేతుల మీదగా కేకును కట్ చేసి టపాసుల మోతలతో, పులవర్షంలో నాయకులు కార్యకర్తల హర్షద్వానాల మధ్యన HAPPY BIRTHDAY బొండా ఉమన్న నినాదాలతో మారుమోగేటువంటి విధంగా వేడుకలను ప్రారంభించడం జరిగింది

21 డివిజన్ ల నుండి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు, రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, డివిజన్ నాయకులు అందరూ కూడా శాలువాలు, పూల బొకేలతో పాటు ఆయా డివిజన్ల కు సంబంధించిన పుట్టినరోజు వేడుకల కేకును తీసుకొని వచ్చి మధ్యాహ్నం వరకు సంబరాలుగా నిర్వహించుకోవడం జరిగింది

 ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ, బొండా రవితేజ మాట్లాడుతూ:- ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే కాక విజయవాడలోని తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గం కూడా మన ప్రియతమ నాయకులు MLA బొండా ఉమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడమే కాక పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వృద్ధులకు చీరలు దుప్పట్ల తో పాటు ఫ్రూట్స్ పంపిణీ, అలాగే స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాలు బిస్కెట్లు వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని

 తమపై నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి ప్రేమకు బొండా ఉమ కుటుంబం ఎప్పుడు మర్చిపోదని గతంలో అతి తక్కువ ఓట్లతో ఓటమిని చూసిన 2024 లో జరిగినటువంటి ఎన్నికలలో భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యే ని గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధి ఒక్క బొండా ఉమా వల్లే సాధ్యమని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నట్టు

 ఈరోజు తమ ప్రియతమ నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది నాయకులు కార్యకర్తలు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని సేవా కార్యక్రమాల ద్వారా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, ఇంకా ఎన్నో నిర్వహించి మన నాయకులకి మంచి పేరును తీసుకొని రావాలని, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటారని, ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారని రానున్న రోజుల్లో మన ప్రియతమ నాయకులు ఉమా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంచి మంచి పదవులు ఆయనకు అందాలని కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు

 ఈ కార్యక్రమలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, గాజుల బ్రథర్స్, గొట్టుముక్కల వెంకటేశ్వర్లు, బాబీ, తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here