శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తో కలిసి గవర్నర్ ని కలిసిన వైయస్సార్ సిపి బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్
వైయస్సార్ కడప జిల్లా, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై, పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వానికి చెందిన గూండాల దాడిపై నిన్నటి సాయంత్రం విజయవాడలోని గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేయడమైనది.
వైసిపి నేతలపై దాడి చేయడం ద్వారా వైసిపి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, ఓటు వేయడానికి భయపడే విధంగా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని…. ఈ అరాచకాలకు పోలీస్ యంత్రాంగం కొమ్ము కాస్తోందని..,. రాష్ట్రంలో, ముఖ్యంగా జడ్పిటిసి ఉప ఎన్నికలు జరుగుతున్న పులివెందులలో శాంతి భద్రతల నిర్వీర్యం పై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేసిన వైసిపి నేతలు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున , కారుమూరి నాగేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు , ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పి రెడ్డి , వరుడు కళ్యాణి , దేవినేని అవినాష్ , బిసి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మరి కొంతమంది వైసిపి ముఖ్య నేతలు.
బొత్స సత్యనారాయణ రమేష్ యాదవ్ తో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు.