
విజయవాడ నగరపాలక సంస్థ
03-11-2025
శాఖధిపతులు స్వయంగా ప్రజల ఫిర్యాదులను పరిశీలించాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
శాఖాధిపతులే స్వయంగా ఫిర్యాదులను పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు.
జోనల్ కార్యాలయాలు మరియు సచివాలయాల్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తూ ప్రధాన కార్యాలయంలో వచ్చే ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుని శాఖధిపతులే స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫిర్యాదు ఇచ్చిన వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, శాశ్వతమైన పరిష్కారమందేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 5, పబ్లిక్ హెల్త్ 3, రెవిన్యూ 1, పి ఓ (యుసిడి) 1,హార్టికల్చర్ 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, బయోలజీస్ట్ కామేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్,డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
![]()
