శరన్నవరాత్రుల్లో కొత్త విధానం ప్రారంభం … దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన

Spread the love

 05..10..2024

 శరన్నవరాత్రుల్లో కొత్త విధానం ప్రారంభం …

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన 

శ్రీ దుర్గా దేవి సౌందర్యలహరి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ లో శనివారం ఆవిష్కరించారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ లో జరిగిన వుస్తకావిష్కరణ లో పాల్గొన్నారు.

 అవదాన సహస్రాఫణి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ చేసిన అవధానం పూర్తి పద్యాలు, పాటల తో శ్రీ దుర్గా సౌందర్య లహరి పుస్తకాన్ని ముద్రించినట్టు ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీదుర్గా దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. దసరా నవరాత్రి ఏర్పాట్లలో భక్తుల సౌకర్యాల గురించి వారినే అడిగి తెలుసుకుంటామన్నారు. ఐ విఆర్ఎస్ విధానంలో కూడా భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ ఆదివారం నుంచి మొదలవుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *