శనివారం 44 డివిజన్ లో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 విజయవాడ పశ్చిమ 

శనివారం 44 డివిజన్ లో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి 

శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. అధికారులు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

శనివారం 44వ డివిజన్లో సానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సృజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం, కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారిశుధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అధికారులు కూడా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, జోనల్ కమిషనర్ కీర్తన, ఈఈ సామ్రాజ్యం, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మైలవరపు దుర్గారావు, మల్లెపు విజయలక్ష్మి బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ బిజెపి మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్ బిజెపి నాయకులు టిడిపి నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *