విజయవాడ పశ్చిమ
శనివారం రధం సెంటర్లో అన్న సంతర్పణ
యాంకర్: ఆకలిగొన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్న లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శంఖానాదం వెంకటరావు పెదపూడి తెలిపారు. ప్రతి పౌర్ణమికి వసంత మల్లికార్జున స్వామి వారి పేరుతో అన్న చేస్తున్నట్లు వివరించారు.
వాయిస్: శనివారం రధం సెంటర్లో వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు వెంకటరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా దాత వి రామచంద్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు దాతలు మరింత సహకారాన్ని అందించడం ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వి. రామచంద్ర, కాటూరి శివప్రసాద్, సాతా కార్తీక్, గోలి సువర్ణ, పెదపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.