వ్యాపారస్తులకుఅండగాఉంటానమ్మకాన్ని వమ్ము చేయను సుజనా చౌదరి

Spread the love

 వ్యాపారస్తులకుఅండగాఉంటానమ్మకాన్ని వమ్ము చేయను సుజనా చౌదరి 

మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ మార్కెట్ వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపూడి మహాత్మా గాంధీ మార్కెట్ ను శుక్రవారం సుజనా చౌదరి సందర్శించారు. మార్కెట్లో పర్యటించి వ్యాపారులను ముఠా కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. మహిళా వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగ వాణిజ్య వ్యాపార రంగాలన్నింటినీ అధోగతి పాలు చేశాడని దుయ్యబట్టారు. అనుభవం లేని నాయకుడికి అవకాశం ఇస్తే ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారన్నారు. రానున్న పది రోజులు కీలకమని సమర్థత సామర్థ్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞతతో ఓటేయాలని పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు ముఠా కార్మికులు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. నియోజవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను అభివృద్ధిచేసే  బాధ్యతను తీసుకొని వారికి అండగా నిలబడతానన్నారు. వారి పట్ల ఎన్డీయే కూటమికి చిత్తశుద్ధి ఉందని కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరిశ్రీరామ్ కృష్ణాజిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వెలగపూడిశంకర్ బాబు ఏపీ చాంబర్ ఫెడరేషన్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు జనసేన ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ బిజెపి నాయకులు పైలా సోమినాయుడు కొణిజేటి నాగేశ్వరరావు లింగాల అనిల్ కుమార్ రౌతు రమ్యప్రియ బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *