విజయవాడ నగరపాలక సంస్థ
08-08-2025
వ్యర్ధాలు ఎక్కువగా వచ్చే చోట కంపాక్టర్ బిన్స్ ని పెంచండి
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం
నగరం లో వ్యర్ధాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో కంపాక్టర్ బిన్స్ సంఖ్యను పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్డు, ఏర్ర మేడ రోడ్డు, బోయపాటి మాధవరావు వీధి, క్రీస్తు రాజు పురం, డెంటల్ కాలేజ్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్డు, బి ఆర్ టి ఎస్ రోడ్డు, నరసరాజు రోడ్డు, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బోయపాటి మాధవరావు వీధిలో పర్యటించి అక్కడ కంపాక్టర్ బిన్స్ ని ఏర్పాటు చేయాలని, అధికారులు విజయవాడ నగర పరిధిలో ప్రాంతాలన్నీ పర్యటించి వ్యర్ధాలు ఎక్కువగా వచ్చే చోట ఎక్కువ కంపాక్టర్ బిన్స్ ని ఏర్పాటు చేసి వ్యర్ధాలు రోడ్డుపైన పడకుండా చూసుకునే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కంపాక్టర్ బిన్స్ ఏర్పాటుచేసిన చోట ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించాలని వ్యర్ధాలు తొలగింపులో ఎటువంటి అలసత్వం వహించరాదని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు
పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ప్రతిరోజు ఇంటి వద్దనే విభజించి చెత్తను సేకరించాలని ప్రజలకు చెత్తను విభజించే ప్రక్రియను పూర్తిగా వివరించి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా సేకరించే పద్ధతిని అలవాటు చేయాలని, అధికారులను ఆదేశించారు.
తదుపరి అయోధ్యనగర్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, త్రాగునీటి, వాడుకనీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం ఉండరాదని అన్న క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.